బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ హవా.. ఏడో రౌండ్ ముగిసే సరికి భారీ మెజార్టీ
- 60,785 ఓట్ల ఆధిక్యం
- ఏడు రౌండ్లలో సుధకు 74,991 ఓట్లు
- 14,165 ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి
బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 14,165 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 4,252 ఓట్లు సాధించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.