నవంబర్ 19 నుంచి కొణిదెల నిహారిక 'ఓసీఎఫ్ఎస్' స్ట్రీమింగ్ ప్రారంభం!
- జీ5లో టెలికాస్ట్ కానున్న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'
- ఈ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక
- 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు
ఈ సందర్భంగా నిహారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'అమ్మ నాన్న ఒక బేవార్స్ కొడుకు'కు మించి ఉంటుంది వీళ్ల 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అని అన్నారు. ఈ సిరీస్ లో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు.