'మంచిరోజులు వచ్చాయి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గోపీచంద్!
- మారుతి నుంచి 'మంచిరోజులు వచ్చాయి'
- సంతోష్ శోభన్ జోడీగా మెహ్రీన్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- నవంబర్ 4వ తేదీన విడుదల
ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ .. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గోపీచంద్ చీఫ్ గెస్టుగా రానున్నాడు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫంక్షన్ మొదలుకానుంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్.. సప్తగిరి .. శ్రీనివాస రెడ్డి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. గోపీచంద్ హీరోగా మారుతి 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.