Chiranjeevi: 'భోళా శంకర్' నుంచి తమన్నాను తప్పించారా?

Bhila Shankar movie update

  • గ్లామరస్ హీరోయిన్ గా మంచి క్రేజ్
  • గతంలో చిరూ జోడీగా చేసిన 'సైరా' 
  • 'భోళా శంకర్' కోసం ఆమె ఎంపిక 
  • తొలగించారని జరుగుతున్న ప్రచారం

చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం అవుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగును జరుపుకుంటోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చిరంజీవి 'భోళా శంకర్' సినిమా చేయనున్నారు. మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా కోసం కథానాయికగా తమన్నాను తీసుకున్నారు. గతంలో 'సైరా' సినిమాలో సాహసోపేతమైన పాత్రలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే.

గ్లామర్ పరంగా .. క్రేజ్ పరంగా తమన్నా మార్కులు ఇంతవరకూ తగ్గలేదు. అలాంటి తమన్నాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమెతో కలిసి స్టెప్పులు వేయాలని ఉందని గతంలో చిరంజీవి ఒక వేదికపై చెప్పారు. అలాంటిది ఇప్పుడు తమన్నాను తప్పించారని అంటున్నారు. కారణాలు మాత్రం తెలియదు. జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.

  • Loading...

More Telugu News