దీపావళికి ఓటీటీలో సందడి చేయనున్న 'శ్రీదేవి సోడా సెంటర్'
- సుధీర్ బాబు, ఆనంది జంటగా శ్రీదేవి సోడా సెంటర్
- 'జీ5' ఓటీటీలో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్
- కరుణకుమార్ దర్శకత్వంలో చిత్రం
- ఇప్పటికే థియేటర్లలో విడుదల
ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎంఎం ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు.