ఒకేసారి రెండు.. రేపు తన జీవితంలో ఎంతో స్పెషల్ అంటూ రజనీకాంత్ ప్రకటన
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న తలైవా
- అవార్డు వస్తుందనుకోలేదన్న రజనీకాంత్
- దాంతో పాటే తన కూతురు ‘హూట్ యాప్’ ప్రారంభం
రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని హర్షం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న రోజే తన కూతురు సౌందర్య ఎంతో ఇష్టపడి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ను విడుదల చేస్తున్నానని వెల్లడించారు. వాస్తవానికి రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత ఏప్రిల్ లోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా అవార్డుల ప్రదానం వాయిదా పడింది.