Amala Paul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Amala Paul to pair up with Nagarjuna

  • నాగార్జునకి జంటగా అమలాపాల్?
  • పూణేలో మొదలెట్టిన రామ్ చరణ్
  • హిందీ ప్రాజక్టుల గురించి సమంత  

*  అక్కినేని నాగార్జున సరసన అమలా పాల్ కథానాయికగా నటించనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న 'ద ఘోస్ట్' చిత్రంలో కథానాయిక పాత్రకు తాజాగా అమలా పాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి పూణేలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చరణ్, కియారా అద్వానీ జంటపై కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ఈ షెడ్యూలులో చిత్రీకరిస్తున్నారు.
*  భవిష్యత్తులో మరిన్ని హిందీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అంటోంది కథానాయిక సమంత. 'హిందీ సినిమాలు చేయాలంటే ఉత్తరాదిన నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అన్న సంశయం ఇంతకుముందు ఉండేది. అయితే, 'ఫ్యామిలీ మేన్ 2' సీరీస్ ని బాగా రిసీవ్ చేసుకోవడంతో, ఇప్పుడు మరిన్ని హిందీ ప్రాజక్టులు చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. 

Amala Paul
Nagarjuna
Ramcharan
Samantha
  • Loading...

More Telugu News