షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో ఎన్సీబీ అధికారుల తనిఖీలు
- బాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
- ఆర్యన్ వాట్సాప్ చాట్ లో యువ నటి పేరు
- విచారణకు హాజరుకావాలంటూ అనన్య పాండేకు ఎన్సీబీ నోటీసులు
మరోవైపు ఎన్సీబీ అధికారులు ఈరోజు షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్యన్ ఖాన్ ఒక యువ నటితో డ్రగ్స్ గురించి వాట్సాప్ లో సంభాషించినట్టు కోర్టుకు ఎన్సీబీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ యువనటి అనన్య పాండే అని తెలుస్తోంది. మరోవైపు అనన్య ఫోన్ ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ ఆమెను ఆదేశించారు.