రవితేజ న్యూ మూవీ టైటిల్ 'ధమాకా'
- విడుదలకి రెడీగా 'ఖిలాడి'
- షూటింగు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
- నక్కిన త్రినాథరావుకి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
ఈ నేపథ్యంలోనే నక్కిన త్రినాథరావుకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ఒక వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాకి 'ధమాకా' అనే టైటిల్ ను సెట్ చేసి, విజయదశమి సందర్భంగా కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను వదిలారు. 'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్ తో ఈ సినిమాలో ఆయన డ్యూయెల్ రోల్ చేయనున్నాడనే హింట్ ఇచ్చారు.
విశ్వప్రసాద్ .. అభిషేక్ అగర్వాల్ .. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ కంటెంట్ తోనే త్రినాథరావు దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఆయనకి రవితేజ తోడైతే తెరపై ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు.