మంచు విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట శ్రీనివాసరావు... ప్రకాశ్ రాజ్ పై విమర్శలు
- అక్టోబరు 10న మా ఎన్నికలు
- కోటను కలిసిన మోహన్ బాబు తదితరులు
- మంచు విష్ణుకు ఓటేస్తానని కోట వెల్లడి
- గొప్పలు చెప్పుకోనంటూ ప్రకాశ్ రాజ్ కు చురకలు
ప్రకాశ్ రాజ్ అనే వ్యక్తి గురించి స్పందించాల్సి వస్తే నటుడిగా అతడి గురించి తానేమీ మాట్లాడబోనని అన్నారు. తాను అతడితో 15 సినిమాల వరకు చేశానని, అయితే, అతడికి క్రమశిక్షణ లేదని విమర్శించారు. ఏనాడూ షూటింగ్ కు టైముకు వచ్చేవాడు కాదని కోట ఆరోపించారు. 'నేను నేషనల్ లెవల్ ఆర్టిస్టుని, నాకు ఇన్ని నందులు వచ్చాయి, అవి వచ్చాయి ఇవి వచ్చాయి అని నేనెప్పుడూ చెప్పుకోను' అంటూ ప్రకాశ్ రాజ్ కు చురకలు అంటించారు.