మోహన్ బాబుతో రాజశేఖర్ మాట్లాడింది ఇదే: జీవిత
- ఇండస్ట్రీలోని వివాదాలపై మాత్రమే మోహన్ బాబుతో చర్చించారు
- చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని చెప్పుకుంటున్నారు
- వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారు
సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదాలపై మాత్రమే మోహన్ బాబుతో రాజశేఖర్ మాట్లాడారని చెప్పారు. చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బయట చెప్పుకుంటున్నారని... ఈ నేపథ్యంలో వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారని అన్నారు. అంతకు మించి ఆయన ఇతర విషయం గురించి మాట్లాడలేదని చెప్పారు.