Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Thamanna out from Master Chef programme

  • కిచెన్ నుంచి తప్పుకుంటున్న తమన్నా? 
  • మళ్లీ టాలీవుడ్ కి వస్తున్న స్నేహ ఉల్లాల్
  • కథలు నచ్చడం లేదంటున్న రకుల్  

*  అందాలతార తమన్నా ఈమధ్య 'మాస్టర్ చెఫ్' టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కార్యక్రమ నిర్వాహకులు ఆశించిన రీతిలో ఈ వంటల కార్యక్రమానికి ప్రేక్షకాదరణ రాకపోవడంతో.. ఇప్పుడు తమన్నా స్థానంలో హోస్టుగా అనసూయను తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చు.
*  గతంలో కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన స్నేహ ఉల్లాల్ మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ కి వస్తోంది. హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న 'ఎయిట్' సినిమాలో ఓ కీలక పాత్రలో స్నేహ నటిస్తోంది.  
*  కథలు నచ్చకపోవడం వల్లే తెలుగులో ఎక్కువగా చేయడం లేదని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'కథ నచ్చితే డేట్స్ సర్దుబాటు చేసుకుని మరీ చేస్తాను. అంతేతప్ప, నేను తెలుగులో చేయడం లేదని మాత్రం అనకండి. ఇక హిందీలో వచ్చే ఏడాది నేను నటించిన ఆరు సినిమాలు రిలీజవుతాయి. వాటి రిజల్టును బట్టి కొత్త సినిమాలు ఒప్పుకుంటాను' అని చెప్పింది రకుల్. ఆమె నటించిన 'కొండపొలం' సినిమా ఈ శుక్రవారం రిలీజవుతోంది.

Thamanna
Anasuya
Sneha Ullal
Rakul Preet Singh
  • Loading...

More Telugu News