రవితేజ 69వ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
- విడుదలకి సిద్ధమైన 'ఖిలాడి'
- సెట్స్ పైకి 'రామారావు ఆన్ డ్యూటీ'
- త్రినాథరావుతో కొత్త ప్రాజెక్టు
- ఈ నెల 4వ తేదీన షూటింగ్ ప్రారంభం
అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. కెరియర్ పరంగా చూసుకుంటే రవితేజకి ఇది 69వ సినిమా అవుతుంది.
విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కథానాయికల విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఇక రవితేజ 'ఖిలాడి' రిలీజ్ కి రెడీ అవుతుండగా, 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగు దశలో ఉంది
.