ఆరుబయట పడుకున్న మహిళకు గొంతులో నొప్పి.. ఆసుపత్రికి వెళితే డాక్టర్లే షాక్!
- గొంతులో బయటపడిన నాలుగు అడుగుల పాము
- దగస్థాన్ అనే ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
- గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలే
అక్కడి వైద్యులు ముందుగా ఆ మహిళకు మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఆమె గొంతులో ఎందుకు నొప్పిగా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడే వారి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఆమె కంఠంలో నాలుగడుగుల పాము దూరింది. అందుకే ఆమె అంత ఇబ్బంది పడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ పామును బయటకు తీసిన వైద్యులు దాన్ని చూసి వణికిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులకైతే నోటమాటలేదు.
ఈ ఘటన రష్యాలోని దగస్థాన్ ప్రాంతంలో వెలుగు చూసింది. లెవాషి అనే గ్రామానికి చెందిన యువతికి ఈ ఘోరమైన అనుభవం ఎదురైంది. ఇక్కడ మరో వింత ఏంటంటే.. ఈ గ్రామం నుంచి గతంలో కూడా ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయట!. ఆరుబయట నిద్రించడం వల్లే ఇలా పాములు వారి నోళ్లలోకి వెళుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.