ఈ నెల 20న 'దృశ్యం 2' ఫస్టులుక్ రిలీజ్!
- నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'దృశ్యం 2'
- ప్రధాన పాత్రల్లో వెంకటేశ్ - మీనా
- 20వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు ఫస్టులుక్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
వెంకటేశ్ - మీనా నటించిన ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అలాగే మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.