8,500 విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి: స్టీఫెన్ రవీంద్ర
- సైబరాబాద్ పరిధిలో 10 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం
- షిటీమ్స్ ను సివిల్ డ్రస్ లో రంగంలోకి దింపుతున్నాం
- నిమజ్జనాలకు 36 చెరువులను ఎంపిక చేశాం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8,500 విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని షీటీమ్స్ ను సివిల్ డ్రస్ లో రంగంలోకి దింపుతున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో నిమజ్జనాల కోసం 36 చెరువులను ఎంపిక చేశామని వెల్లడించారు. చెరువుల వద్ద లైట్లు, మొబైల్ టాయిలెట్లు, శానిటైజేషన్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. రోడ్లను కూడా మరమ్మతు చేశామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 100కి ఫోన్ చేయాలని సూచించారు. నిమజ్జనాలు పూర్తయ్యేంతవరకు ఏసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.