'మరో ప్రస్థానం' ట్రైలర్ రిలీజ్!
- జానీ దర్శకత్వంలో తనీష్
- యాక్షన్ థ్రిల్లర్ గా సాగే కథ
- కథానాయికగా ముస్కాన్ సేథీ
- ఈ నెల 24వ తేదీన విడుదల
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరోకి .. విలన్ గ్యాంగ్ కి మధ్య నడిచే వార్ ప్రధానంగా ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. కబీర్ దుహాన్ సింగ్ విలనిజాన్ని కొత్త కోణంలో చూపించినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందనీ, ఈ సినిమా తనని మరో మెట్టు పైకి చేరుస్తుందని తనీష్ అంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.