సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన నయనతార
- చివరి షెడ్యూలులో 'విరాటపర్వం'
- 'మ్యూజిక్ స్కూల్' కోసం శ్రియ డ్యాన్స్
* రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'విరాట పర్వం' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
* ప్రముఖ నటి శ్రియ తాజాగా 'మ్యూజిక్ స్కూల్' అనే చిత్రంలో నటిస్తోంది. బియ్యాల పాపారావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె నాట్యకళాకారిణిగా కనిపిస్తుంది. దీని గురించి ఆమె చెబుతూ, 'నేను బేసికల్ గా కథక్ డ్యాన్సర్ ని. ఇప్పుడీ చిత్రం కోసం మరో డ్యాన్స్ ను కూడా నేర్చుకుంటున్నాను' అని చెప్పింది.