సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధార్థ్ శుక్లా పోస్ట్
- 40 ఏళ్ల వయసులోనే మృతి చెందిన సిద్ధార్థ్ శుక్లా
- గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి
- ఫ్రంట్ లైన్ వర్కర్లు, పారాలింపిక్స్ విన్నర్లను ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టిన సిద్ధార్థ్
ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ ధన్యవాదాలు అని తన పోస్ట్ లో తెలిపారు. ప్రాణాలు పణంగా పెడుతూ, నిరంతరాయంగా మీరు పని చేస్తారని కొనియాడారు. కుటుంబాలతో కలిసి ఉండలేని రోగులకు ఓదార్పునిస్తారని పేర్కొన్నారు. ముందు వరుసలో ఉండి పని చేయడం సామాన్యమైన విషయం కాదని... మీ కష్టాన్ని మేము అభినందిస్తున్నామని అన్నారు. పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు మనం గర్వించేలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.