చంద్రబాబు పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఇతరుల పిల్లలు చదువుకోకూడదా?: మిథున్ రెడ్డి
- ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేయడం దారుణం
- లోకేశ్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు?
- తెలుగులోనే చదివితే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి?
అసలు చంద్రబాబు పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఇతరుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. కేవలం తెలుగులోనే చదివితే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడానికే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చదువుకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.