మంత్రుల కార్యక్రమంలో దొంగల హల్ చల్.. నేతల జేబులు గుల్ల: ఇదిగో వీడియో
- యాదాద్రి జిల్లా మోత్కూరులో ఘటన
- నిన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
- జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరు
- వారికి స్వాగతం పలికిన స్థానిక నేతలు
- మధ్యలో దూరి జేబులు కొట్టేసిన దొంగలు
- శాలిగౌరారంలోనూ ఘటన
వారు అక్కడికి చేరుకున్నాక స్థానిక నేతలు, కార్యకర్తలు వారికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వారితో పాటు గుంపులో దూరిన దొంగలు మోత్కూరు జడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్ రెడ్డి జేబులోని డబ్బును దోచేశారు. కార్యక్రమం అయిపోయాకగానీ గుర్తించలేకపోయిన ఆయన.. రూ.40 వేలు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు శాలిగౌరారంలోనూ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. రెండు చోట్లా రూ.లక్ష వరకు కాజేశారు. అయితే, వారి చేతివాటం కెమెరా కంటికి చిక్కింది. జేబు నుంచి డబ్బు కొట్టేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.