'కిన్నెరసాని' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్!
- మిస్టరీ థ్రిల్లర్ గా 'కిన్నెరసాని'
- కొత్త లుక్ తో కల్యాణ్ దేవ్
- ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
అద్భుతం జరిగే ప్రతి చోటా ఆపద ఉంటుంది.. ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలి .. అది ద్వేషానికైనా, చివరికి ప్రేమకైనా అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో వచ్చిన చిత్రాలలో కంటే భిన్నంగా ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ద్వారా కొత్త కథానాయిక పరిచయం కానుంది.