బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కేపై పరువు నష్టం దావా వేసిన నటుడు మనోజ్ బాజ్ పాయ్
- మనోజ్ నటించిన 'ఫ్యామిలీ మెన్' సిరీస్ పై కేఆర్కే విమర్శలు
- మనోజ్ గంజాయి మత్తులో ఉంటాడని ఆరోపణ
- ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా వేసిన మనోజ్
దీనికి కేఆర్కే సమాధానమిస్తూ... తాను చెత్త పనులు చేయనని... వెబ్ సిరీస్ లు చూడనని చెప్పాడు. అందువల్ల సునీల్ పాల్ వంటి వారిని కొన్ని విషయాలు అడగాలని.. ఎప్పుడూ గంజాయి మత్తులో ఉండే మనోజ్ ను సునీల్ ఎలా చూడగలుగుతారో అని అన్నారు. బాలీవుడ్ మత్తులో జోగుతోందని విమర్శించే వాళ్ల సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేఆర్కేపై మనోజ్ ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా వేశాడు. దీనిపై సెప్టెంబర్ 4న కోర్టులో విచారణ జరగనుంది.