రమ్య ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది: నారా లోకేశ్
- ఇటీవల సంచలనం సృష్టించిన రమ్య హత్య
- రాజుపాలెంలో తాజాగా మరో ఘటన
- దళిత బాలికపై అత్యాచారం జరిగిందన్న లోకేశ్
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
విపక్ష నాయకులను తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయి ఉండేవి కావని వ్యాఖ్యానించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.