Chiranjeevi: చిరూకి 'గాడ్ ఫాదర్' టైటిల్ ను ఇచ్చేసిన యంగ్ డైరెక్టర్!
- 'ఆచార్య' టాకీపార్టు పూర్తి
- పాటల చిత్రీకరణకు ఏర్పాట్లు
- షూట్ కి రెడీ అవుతున్న 'లూసిఫర్' రీమేక్
- కీలక పాత్రలో సత్యదేవ్
ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దసరాకి ముందే ఈ సినిమా విడుదల కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ సినిమా తరువాత, మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'లూసిఫర్' సినిమా రీమేక్ లో చిరంజీవి చేయనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని అనుకున్నారు.
అయితే ఈ టైటిల్ దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉందట. 'రచ్చ' సినిమా నుంచి సంపత్ నందికి చిరూ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన మెగా ఫ్యామిలీ నుంచి కబురు వెళ్లగానే సంపత్ నంది సంతోషంగా ఆ టైటిల్ ను చిరూకి ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్న సంగతి తెలిసిందే.