నాగబాబు అల్లుడు చైతన్యపై పోలీసులకు అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదు
- ఫిల్మ్‌నగర్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకున్న నిహారిక, చైతన్య
- గుంపులుగా కొందరు వస్తున్నారంటూ అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదు
- అపార్ట్‌మెంట్ వాసుల వల్ల తమకూ ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య కూడా ఫిర్యాదు
రెసిడెన్షియల్ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభ్యంతరాలు తెలిపారు. కొందరు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మరోపక్క, అపార్ట్ మెంట్ వాసులపై చైతన్య కూడా ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నాడు. ఇరు వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.