నారాయణ ముగ్గురు పిల్లలు నా సొంత బిడ్డలతో సమానం: థర్టీ ఇయర్స్ పృథ్వి
- ఇటీవల మరణించిన మిలిటరీ నారాయణ
- పృథ్వి కుటుంబంతో కలిసి నివసిస్తున్న నారాయణ పెద్ద కూతురు
- నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పృథ్వి
మిలిటరీ నారాయణకు భార్య లలిత, ఇద్దరు కూతుళ్లు తేజస్విని, దివ్య, కుమారుడు తరుణ్ కుమార్ ఉన్నారు. పెద్ద కూతురు 2014 నుంచి టాలీవుడ్ లో పని చేస్తున్నారు. హైదరాబాదులో పృథ్వి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రెండో కూతురు బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి సచివాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు తరుణ్ డిప్లొమో పూర్తి చేసి పెనుకొండ సమీపంలోని కియా కార్ల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.
ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ, నారాయణ పిల్లలు కూడా తన సొంత బిడ్డలతో సమానమని చెప్పారు. వారు మంచి పొజిషన్ కు వెళ్లేంత వరకు తన వంతు సాయం చేస్తానని తెలిపారు. మిలిటరీ నారాయణ అంత్యక్రియలకు రాలేకపోవడంతో ఆయన ఈరోజు వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు.