దేశంలో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ కథనాలపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి
- ఓ వెబ్ పోర్టల్ లో సంచలన కథనం
- పెగాసస్ స్పై వేర్ చొప్పించి హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు
- ఇవన్నీ నిరాధారమన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్
- భారత ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకని విమర్శలు
ఫోన్ హ్యాకింగ్ పై ఓ వెబ్ పోర్టల్ లో సంచలన కథనం వచ్చిందని అన్నారు. అయితే, సరిగ్గా లోక్ సభ సమావేశాల ప్రారంభానికి ముందే ఇలాంటి కథనాలు రావడాన్ని తాము కాకతాళీయం అని భావించడంలేదని, ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలు తీసుకువచ్చారని నమ్ముతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయని, భారత ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకే ఈ కథనాలు రూపొందిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు సంచలన కథనం రావడం వెనుక ఆంతర్యం ఏమిటో గ్రహించాలని పేర్కొన్నారు.