వర్షం కారణంగా ఆగిన 'పుష్ప' షూటింగ్!
- రీసెంట్ గా సెట్స్ పైకి 'పుష్ప'
- 45 రోజుల షెడ్యూల్
- వర్షం కారణంగా దెబ్బతిన్న సెట్లు
- ఆలస్యం కానున్న షూటింగ్
హైదరాబాద్ లో కొన్ని రోజులుగా పడుతున్న వానల కారణంగా 'పుష్ప' కోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్లు దెబ్బతిన్నాయట. అందువలన ప్రస్తుతానికి షూటింగు ఆపేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా ఈ షెడ్యూల్ కొంత ఆలస్యంగా పూర్తికావొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ పాల్గొననున్నాడు. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ వచ్చాడని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.