తొలగించిన మంత్రులకు కీలక బాధ్యతలు.. బీజేపీలో భారీ మార్పులు!
- సదానందగౌడ, హర్షవర్ధన్‌కు సొంత రాష్ట్రాల బాధ్యతలు
- యూపీ నేత సంతోష్ గంగ్వార్‌కు గవర్నర్ పదవి!
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్‌లలో ఒకరికి రాజ్యసభా పక్షనేత పదవి
సదానంద గౌడను సొంత రాష్ట్రమైన కర్ణాటకకు, హర్షవర్ధన్‌ను ఢిల్లీకి పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, స్వతంత్ర హోదాలో పనిచేసిన యూపీ నేత సంతోష్ గంగ్వార్‌కు గవర్నర్ పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. థావర్ చంద్ గెహ్లాట్ స్థానంలో ఖాళీగా ఉన్న రాజ్యసభా పక్షనేత పదవి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్‌లలో ఒకరికి లభించే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లకు అప్పగించనున్నారు. మరోవైపు, బీజేపీ, ఆరెస్సెస్ సమన్వయ బాధ్యతలను సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌కు అప్పగించాలని ఆరెస్సెస్ నిర్ణయించింది.