అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.. చర్యలు తీసుకోండి: పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
- ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేసిందని ఫిర్యాదు
- బూతులతో కామెంట్లు పెడుతున్నారన్న మోహన్ బాబు
- కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
మోహన్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. మోహన్ బాబు తరపున ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానల్ మోహన్ బాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని ఆయన తెలిపారు.