చెన్నై చేరుకున్న రజనీకాంత్.. అభిమానుల ఘన స్వాగతం
- వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్
- 2016లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్న తలైవా
- 20 రోజుల తర్వాత చెన్నైకి చేరుకున్న రజనీ
మరోవైపు ప్రస్తుతం రజనీ 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీ చేయబోయే చిత్రానికి ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.