వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ .. హీరోయిన్ గా పూజ హెగ్డే!
- పూజ హెగ్డే చేతిలో భారీ ప్రాజెక్టులు
- వరుసగా థియేటర్లకు రానున్న సినిమాలు
- నితిన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్
- దర్శకుడిగా వక్కంతం వంశీ రెండో సినిమా
తాజాగా ఈ సినిమా కోసం పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అగ్రిమెంట్ కూడా అయిపోయిందని అంటున్నారు. పూజ తాజా చిత్రంగా అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమాలో కథానాయికగా కూడా పూజ పేరునే వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా నితిన్ ప్రాజెక్టు కూడా ఆమె ఖాతాలో చేరిపోయింది. 'నా పేరు సూర్య'ను హిట్ దిశగా పరిగెత్తించలేకపోయిన వక్కంతం వంశీ, ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.