'భీష్మ'తో హిట్ ఇచ్చిన దర్శకుడితో నితిన్!
- నిరాశపరిచిన 'చెక్' .. 'రంగ్ దే'
- షూటింగు దశలో 'మాస్ట్రో'
- వెంకీ కుడుముల కథకు ఓకే
- రష్మికను తీసుకునే ఛాన్స్
నిజానికి 'భీష్మ' తరువాత వెంకీ కుడుముల ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే ప్రయత్నాలు చేశాడు కానీ సెట్ కాలేదు. ఈ సమయంలోనే నితిన్ 'చెక్' .. 'రంగ్ దే' సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ప్రస్తుతం 'మాస్ట్రో' చేస్తున్న నితిన్ కి వెంకీ కుడుముల కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగును పూర్తిచేయాలని అనుకుంటున్నారట. ఇక కథానాయికగా రష్మికను సెట్ చేసే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు.