క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో దర్శకుడు శంకర్ కుమార్తె వివాహం... ఫొటోలు ఇవిగో!
- నేడు ఐశ్వర్య, రోహిత్ ల వివాహం
- చెన్నైలో ఘనంగా జరిగిన పరిణయం
- విచ్చేసిన సీఎం స్టాలిన్
- వధూవరులకు ఆశీర్వాదాలు
శంకర్ కుమార్తె ఐశ్వర్య వైద్యురాలు కాగా, రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్ పీఎల్)లో మధురై పాంథర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రోహిత్ తండ్రి దామోదరన్ మధురై జట్టుకు యజమాని. ఆయన తమిళనాడులో ప్రముఖ పారిశ్రామికవేత్త. ఐశ్వర్య, రోహిత్ దామోదరన్ ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

