గోవాలో 'పుష్ప'రాజ్ ఇంట్రడక్షన్ సాంగ్!
- ఫారెస్టు నేపథ్యంలో సాగే కథ
- తదుపరి షెడ్యూల్ గోవాలో
- మాస్ ను మెప్పించే దేవిశ్రీ సంగీతం
- ముఖ్యమైన పాత్రలో ఐశ్వర్య రాజేశ్
గోవాలో అల్లు అర్జున్ కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను .. ఆయన ఇంట్రడక్షన్స్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా డిజైన్ చేయడం జరిగిందని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ప్రతినాయకుడిగా ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు.