ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరిన రజనీకాంత్
- దాదాపు మూడు నెలల పాటు అక్కడే విశ్రాంతి
- 2011లో కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స
- పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షలు
కిడ్నీ చికిత్స చేయించుకుని పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనా, జగపతి బాబు, కీర్తి సురేశ్ నటిస్తున్నారు.