మూడు సినిమాలు లైన్లో పెట్టిన శ్రీను వైట్ల!
- 'దూకుడు' సీక్వెల్ ఆలోచన లేదు
- మల్టీస్టారర్ గురించిన వార్త పుకారే
- మూడు సినిమాలు వినోదప్రధానమైనవే
తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "నేను 'దూకుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా, అలాగే ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. అలాగే 'డి&డి' సినిమా కూడా 'ఢీ' సినిమాకి సీక్వెల్ అని రాస్తున్నారు .. ఇది కూడా నిజం కాదు. 'డి &డి' కథాకథనాలు పూర్తిగా వేరు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేయనున్నాను. ఈ మూడు కూడా ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తూ నా మార్కులో సాగేవే" అంటూ చెప్పుకొచ్చాడు.