రామోజీ ఫిలిం సిటీలో విశాల్ షూటింగ్!
- విడుదలకి సిద్ధంగా రెండు సినిమాలు
- తదుపరి ప్రాజెక్టు పట్టాలపైకి
- జులై చివరివరకూ షూటింగ్
- కొత్త దర్శకుడి పరిచయం
విశాల్ ఈ సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. అయితే కరోనా కారణంగా కుదరలేదు. దాంతో కరోనా ప్రభావం తగ్గేంతవరకూ వెయిట్ చేసిన ఆయన, తాజాగా హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగును మొదలుపెట్టారు. జులై చివరివరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందట. సొంత బ్యానర్ పై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'నాట్ ఏ కామన్ మేన్' అనే టైటిల్ ను సెట్ చేశారు. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ గా ఉండనుంది. ఈ సినిమా ద్వారా 'శరవణన్' అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.