కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నితిన్?
- నిరాశ పరిచిన రెండు సినిమాలు
- మూడో సినిమా కూడా ఈ ఏడాదిలోనే
- లైన్లో వక్కంతం వంశీ
- త్వరలోనే సెట్స్ పైకి
ఇక వచ్చే ఏడాదిలో కూడా ఆయన ఇదే జోరును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. వక్కంతం వంశీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్, త్వరలో ఆ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఒక వైపున ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఆయన ఓ కొత్తదర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ ఎడిటింగ్ చేస్తూ వచ్చిన ఎస్.ఆర్.శేఖర్, మెగాఫోన్ పట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆయన వినిపించిన కథకి నితిన్ ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.