యాక్షన్ ఎపిసోడ్స్ కోసం నాగ్ ప్రత్యేక శిక్షణ!
- ప్రవీణ్ సత్తారుతో నాగ్ మూవీ
- సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలు
- కథానాయికగా కాజల్ అగర్వాల్
- కథపై నమ్మకంతో వున్న నాగ్
కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. తదుపరి షెడ్యూల్లో నాగ్ పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపించనున్న నాగార్జునపై హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేశారని అంటున్నారు. అందుకోసం నాగార్జున ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నారట. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.