రజనీకాంత్ స్టైల్ ను అనుకరించానంటున్న ధనుశ్!
- ధనుశ్ హీరోగా 'జగమే తంతిరం'
- మాఫియా నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్
- తెలుగు టైటిల్ గా 'జగమే తంత్రం
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుశ్ మాఫియా డాన్ గా నటించాడు. తెలుగులో ఈ సినిమాకి 'జగమే తంత్రం' అనే టైటిల్ ను సెట్ చేశారు. తాజాగా ఈ సినిమాను గురించి ధనుశ్ మాట్లాడుతూ .. "నేను ఇంతవరకూ చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడక్కడా రజనీ స్టైల్ ను ఫాలో అయ్యాను. ఆ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తాయి. మాఫియా డాన్ గా చేసేవారిపై ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది .. దాని నుంచి తప్పించుకోలేం" అని చెప్పాడు. రెండు భాషల్లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.