రాఘవేంద్రరావు జోడీగా సీనియర్ హీరోయిన్!
- నటిగా లక్ష్మి స్థానం ప్రత్యేకం
- వివిధ భాషల్లో ఇప్పటికీ బిజీనే
- మరిచిపోలేని చిత్రంగా 'మిథునం'
- తనికెళ్ల భరణి దర్శకత్వంలో మరోసారి
రాఘవేంద్రరావు ప్రధానమైన పాత్రధారిగా తనికెళ్ల భరణి ఒక సినిమా చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన నటించడానికి లక్ష్మిని ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. రాఘవేంద్రరావు ఎక్కువ మౌనంగా ఉంటారు .. అలాంటి ఆయన నటనవైపుకు రావడం అభిమానుల్లో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో, శ్రియ గెస్ట్ రోల్ చేయనుందని అంటున్నారు.