వైఎస్ జగన్ ఓ లక్ష్యం ఉన్న నాయకుడు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- విశాఖలో 1000 పడకల కొవిడ్ చికిత్స కేంద్రం
- తొలిదశలో 300 పడకలతో అందుబాటులోకి వచ్చిన ఆసుపత్రి
- వర్చువల్ గా ప్రారంభించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- సీఎం జగన్ పై ప్రశంసలు
అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తోన్న ఏపీ మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పనలో ఏపీ అగ్రగామిగా ఉందని, మంచి నిర్ణయాలు, మంచి కార్యక్రమాలకు ఏపీ అన్ని వేళలా కేంద్రానికి అండగా నిలుస్తోందని కొనియాడారు. విశాఖలో ఆర్ఎన్ఐఎల్ ఆధ్వర్యంలో 1000 పడకల కొవిడ్ చికిత్స కేంద్రం నిర్మాణం జరగ్గా, అందులో తొలిదశలో 300 పడకల సామర్థ్యం గల ఆసుపత్రి నేడు అందుబాటులోకి వచ్చింది.