'అఖండ' ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- బాలయ్యతో బోయపాటి మూడో సినిమా
- ముగింపు దశలో చిత్రీకరణ
- సంగీత దర్శకుడిగా తమన్
- ఈ నెల 28 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
నిజానికి ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అనుకున్న సమయానికి షూటింగ్ చేయడం వీలుపడలేదు. దాంతో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ సింగిల్ ను వదిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు భావించారు. కానీ ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసహనానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ వదులుతారా .. లేదా? అనేది వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న.