ప్రభుదేవాతో గొడవేం లేదన్న స్టార్ ప్రొడ్యూసర్
- తొలి హిట్ వెంకటేశ్ 'శత్రువు'
- 'ఒక్కడు'తో మహేశ్ కి తిరుగులేని సక్సెస్
- 'వర్షం' ప్రభాస్ ఎప్పటికీ మరిచిపోలేని హిట్
- నిరాశ పరిచిన 'పౌర్ణమి' ఫలితం
ఇక 'వర్షం' సూపర్ హిట్ తరువాత ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు మరో సినిమాను నిర్మించారు .. ఆ సినిమా పేరే 'పౌర్ణమి'. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్ర్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ సమయంలోనే ప్రభుదేవాకు .. ఎమ్మెస్ రాజుకు మధ్య గొడవ జరిగిందనే టాక్ వచ్చింది. సందర్భాన్ని బట్టి ఇప్పటికీ ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. " నిజమే అప్పట్లో ఆ టాక్ వచ్చింది .. కానీ అందులో నిజం లేదు. ప్రభుదేవాతో ఎలాంటి గొడవలు లేవు .. ఇప్పటికీ మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉంటాము" అని చెప్పుకొచ్చారు.