చరణ్ కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!
- త్రివిక్రమ్ తో మెగా హీరోలు
- పవన్ .. బన్నీలతో మూడేసి సినిమాలు
- మహేశ్ సినిమా తర్వాత చరణ్ తో
- కాస్త ఆలస్యంగా పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్
ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఏ హీరోతో త్రివిక్రమ్ ప్రాజెక్టు ఉండనుంది? అనే ప్రశ్నకి సమాధానంగా చరణ్ పేరు వినిపిస్తోంది. మెగా హీరోల్లో పవన్ తోను .. బన్నీతోను మూడేసి సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్, చరణ్ తో మాత్రం ఇంతవరకూ సినిమా చేయలేదు. ఆయనతో తప్పకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఒక కథను రెడీ చేసి ఉంచాడట. మహేశ్ తో సినిమా తరువాత త్రివిక్రమ్ పట్టాలెక్కించే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.