'పాగల్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విష్వక్సేన్
- విష్వక్సేన్ నుంచి రానున్న 'పాగల్'
- ఓటీటీకి వెళ్లదని చెప్పిన హీరో
- కథానాయికగా నివేదా పేతురాజ్
- దర్శకుడిగా నరేశ్ కుప్పిలి పరిచయం
ఈ సినిమాను ఈ ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వ్యాప్తి విపరీతంగా ఉండటంతో వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించాలని అనుకున్నారు. కానీ ఈ లోగానే .. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. రోజురోజుకూ ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో, స్వయంగా విష్వక్సేన్ రంగంలోకి దిగాడు. 'పాగల్' ఓటీటీకి వెళుతుందనే ప్రచారంలో నిజం లేదనీ, ఈ సినిమా థియేటర్లకే వస్తుందని స్పష్టం చేశాడు.