నా తండ్రి చేసిన తప్పు.. నేనూ చేయకూడదనే...: రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ సంచలన వ్యాఖ్యలు
- బాధల బంధనాలను తెంచుకునేందుకే దూరంగా వచ్చేశాం
- తన పెంపకంలో తన తండ్రి ఎన్నో బాధలు పడ్డారని కామెంట్
- రాచబిడ్డలా పెంచేందుకు ఎన్ని కష్టాలు పడ్డారోనని ఆవేదన
- తన పిల్లల విషయంలో అది జరగకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
ఈ విషయంలో తన తండ్రిని నిందించదలచుకోలేదని హ్యారీ చెప్పారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన పిల్లల పెంపకం విషయంలో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్నారు. రాజకుటుంబంలో ఇలాంటి బాధలే తన తల్లిదండ్రులూ పడి ఉండొచ్చన్నారు. కాబట్టి ఆ బాధల బంధనాలను తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.
తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు.