బాలయ్య అంటే భయపడిపోయిందట!
- షూటింగు దశలో 'అఖండ'
- బాలయ్యకు కోపం ఎక్కువ అనుకున్నాను
- ఆయన చాలా కూల్
- నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నానన్న ప్రగ్య
తాజా ఇంటర్వ్యూలో ప్రగ్య ఈ సినిమా గురించిన విషయాలను ప్రస్తావించింది. 'ఈ సినిమాలో బాలకృష్ణగారి సరసన చేయవలసి ఉంటుందనే సరికి నేను భయపడ్డాను. ఆయనకి చాలా కోపం ఎక్కువనీ .. ఆయన ఉన్నంత సేపు సెట్లో సైలెంట్ గా ఉండాలని నాకు చాలామంది చెప్పారు. దాంతో ఆయనతో కలిసి నటించాలనేసరికి నేను చాలా భయపడిపోయాను. కానీ సెట్లో బాలకృష్ణ గారు సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కూల్ గా ఉండటంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా? అని నేను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.